శంభో శంభో…శివ శంభో స్వయంభో…

ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సమీపంలో ఉన్న బుగ్గలో శ్రీ రాజరాజేశ్వరుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం.ఈ క్షేత్రం చోళుల నాటి నుండి ప్రసిద్ధి చెందింది.ఇక్కడికి రాణి రుద్రమ దేవీ, ఛత్రపతి శివాజీ లాంటి నాయికా- నాయకులు తమ ఆయుధాలను తీసుకొని వచ్చి ఈ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసే వారని   స్థానికుల ద్వారా వ్యక్తమవుతుంది.

పరమ పవిత్రమైన గంగమ్మ తల్లి నిర్విరామంగా రాజరాజేశ్వరుడిని అభిషేకించి తరిస్తుంది.విశాలమైన ఆవరణలో పచ్చని ప్రకృతిని ఆశ్వాదిస్తూ రాజరాజేశ్వరుడు భక్తులను అలరిస్తూ ఉన్నాడు.
ఇష్టమైన పూలు: తెల్లని పూలు,మారేడు దళాలు.

ఇష్టమైన పూజలు: త్రికాలాభిషేకం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అన్నం పాయసం.

                           -తోలేటి వెంకట శిరీష

Leave a comment