రాజరాజేశ్వరీ….దేవి కన్యాకుమారి

రక్షింపుము జగధీశ్వరి….

జగత్జననీ అవతారమే ఈ రాజ రాజేశ్వరి దేవి.అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనం ఇస్తున్నారు హైదరాబాద్ మెహిదీపట్నంలో. పీఠాధిపతుల ఆధ్వర్యంలో
ప్రతిష్ఠ చేశారు. పెద్ద ఆవరణలో పచ్చని చెట్ల మధ్య అమ్మ వారు కొలువై ఉన్నారు.
ఇక్కడ దేవాలయంలో శ్రావణ మాసం,దసరా,కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.రాజరాజేశ్వరీ అమ్మ వారు నిత్యం భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి గా ఆశీస్సులతో రక్షిస్తుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,పాయసం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment