సింపుల్ గా బరువు లేకుండా ఏ సందర్భానికైన అనువుగా ఉండే చీరెలు కావాలంటే రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో తయారయ్యే చీరెలు ఎంచుకోవచ్చు. ఇవి పల్చగా బాగా సున్నితమైన పనితనంతో ఉంటాయి. కోటా డోరియాలు ఆఫీస్ కు సరైన ఎంపిక కూడా. వీటిలో అత్యంత సంప్రదాయంగా కనిపించే హెవీ రకాలు కూడా ఉన్నాయి. కోటా డోరియా చీరెలు నాణ్యమైన నూలు ,తేలికపాటి బరువులో ఉంటాయి. అంటే రాజస్థాన్ వేడి వాతావరణానికి అనువుగా ఉండే చీరెలు ఇవి. గడుల రకాలను ఖట్స్ అంటారు. ఈ కోటా డోరియా రాజస్థానీ రాచరికానికి చెందిన వారు ఇష్టంగా నేయించుకొన్న రకాలు అంటారు. వీటిలో బేసిక్ ,ప్రింటెడ్ జరాస్టయిల్స్ బావుంటాయి.ఇవి పండుగ సందర్భల్లోనూ చక్కగా ఉంటాయి.

Leave a comment