అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత ని ఇస్తుందని తెలిసిన నుభవం లోకి వచ్చిన విషయమే. అంతేకాదట. ఆ స్పర్శ బిడ్డ మెదడుని ప్రభావితం చేస్తుందని ముఖ్యంగా పసిబిడ్డ కు అమ్మ స్పర్శ నొప్పిని తెలియనివ్వదని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ కుచెందిన నిపుణులు ఒక అభిప్రాయం వెళ్లబుచ్చారు. ఇంకా ఇప్పుడే పుట్టిన బిడ్డ మెదడు పెరుగుదలకు కూడా అమ్మ స్పర్శ  ఉపయోగపడుతుందిట. ముఖ్యంగా నొప్పి తెలియకుండా పసి పిలల్లకు ఇచ్చే మందుల కన్నా అనారోగ్యంగా ఉన్న బిడ్డకు తల్లి సమక్షం ఆమె చేతుల స్పర్శ. ఆమె వంటి నుంచి వచ్చే అలవాటైన వాసనకూడా మొప్పి తెలియకుండా చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందిట. అంటే పసిబిడ్డకు తల్లి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళు మానసికంగా శారీరికంగా అంత ఆరోగ్యంగా ఉంటారన్నమాట.

Leave a comment