శ్రీ రామ దూతం శిరసా నమామి!!

ఆశ్వీయుజ మాసంలో వచ్చే విశిష్టమైన,పవిత్రమైన తిథి ఈనాటి రామ ఏకాదశి.ఈ రోజు శ్రీ లక్ష్మీ నారాయణలను పూజించాలి.ఉపవాస దీక్షతో నిత్యం కృష్ణ,నారాయణ,గోవింద అని స్మరిస్తూ ఉండాలి.
ఈ రోజు బియ్యం, గోధుమ, బార్లీతో తయారీ పదార్థాలు ముట్టుకోరాదు.సాయంత్రం దగ్గరలో వున్న లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి విష్ణు సహస్ర నామం,అష్టోతరం పఠనం చేసి ముక్తి పొందాలి.చెడు మాటలు వినకూడదు, మాట్లాడకూడదు.సాత్వికాహారం భుజించాలి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పాలు,పండ్లు.

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment