నెయిల్ ఆర్ట్. అమ్మాయిల ఫ్యాషన్ లు ఎప్పుడు ముందు వరుసలో పిథం వేసుకున్న బ్యూటీ ఫుల్ ట్రెండ్. ఏళ్ళు గడుస్తున్నా దీనికున్న డిమాండ్ పెరగటమే కానీ తగ్గిందే లేదు. ఇప్పుడు గోళ్ళకు ఒక రంగు వేయగానే రెండు, మూడు షేడ్ లు వచ్చేలాగ కలర్ షిప్టింగ్ మల్టీ క్రోమ్. నెయిల్ పాలిష్ లు వస్తున్నాయి. ఈ రంగు వేసుకుంటే ఒకే గోరు పైన రెండు రకాల గోళ్ళరంగు కళాత్మకంగా వేసినట్లే అనిపిస్తుంది. అంతేనా లైట్ పడితే చాలు ఇది చక్కగా మెరవడంతో పాటు రంగుల్లో తేడా మరింత బాగా చూపిస్తుంది. ఇలా వేసుకుంటే నెయిల్ ఆర్ట్ తో సంబంధం లేకుండా గోళ్ళ ముస్తాబు ముగించ వచ్చు. బర్లీ, పాలిష్ మీ సిల్లీ పేర్ల తో కనబడే ఈ గోళ్ళ రంగులు ఓ సారి ఆర్డరిస్తే ఇంటికొస్తాయి.

Leave a comment