ఎన్ని రాకాల మామిడి పండ్లు మార్కెట్ లో రసాలు, బంగిన పల్లి, ఆల్ఫాన్సో, దశ హరి, హిమాయుద్దీన్, తోతాపూరి, సువర్ణ రేఖ, నీలం, కొబ్బరి మామిడి, మల్లిక, ఆమ్రాపాలి, ఆర్కి అరుణ, బాంబే గ్రీన్, పంచదార కలశ, గోలైన్ మంగో, నోరూరించే రుచితో, రంగుతో కనువిందు చేసే మామిడి రుచిలోనూ విటమిన్లు, ఖనిజాలున్న రారాజే ఇన్ని రకాల మామిడి పండ్లు ఒకే రుచి తో ఎలా ఉంటాయి. అన్నింటిలోను రుచికరమైనది ఏది అని గిన్నీస్ బుక్ ఆరా తీస్తే ఫిలిప్పీన్స్ స్వీట్ ఎలినా, గుయ్ మారాన్ మామిడి తియ్యదనంతో అగ్ర స్థానంలో వున్నాయిట నోరూరించే ఆ మామిడిని ఈ సీజన్ లో తప్పనిసరిగా తినాలి. శరీరం లోని అన్ని నాడులను పరిపుష్టం చేస్తుంది. ఇందులోని ట్రప్టోఫాన్ ఆనందాన్ని అందించే సేరటోనిన్ ను విడుదల చేస్తుంది. ఏకాగ్రతని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మంచి నిద్ర ఇస్తుంది. అందుకని పడుకునే ముందర ఓ మామిడి పండు తినమని సలహా ఇస్తున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories