చాలా అందమైన ఖరీదైన డ్రెస్ కూడా ఒక్క ఉతుకుతో రంగు తగ్గి వెలసి పోతాయి. డ్రైవాష్ కి వేసిన ఏ కొంగు రంగో చీరపైన మరకల్లా పడిపోతుంది. పట్టు చీరెల్లాంటి విలువైన దుస్తులు ఉతికేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉతికే ముందు వాటిపై లేబుల్ ఒక సారి చూడాలి. ఎలా ఉతకాలో సలహాలు ఉంటాయి. చల్లని నీళ్లు ,గోరువెచ్చని నీళ్లు ,వాషింగ్ మెషన్ లో ఉతకాలో రాసి ఉంటుంది. ఒక బకెట్ లో ఒక కప్పు వెనిగర్ వేసి అందులో రంగు దుస్తులు నానబెట్టి ఉతికితే వాటి రంగు పోకుండా ఉంటుంది. మురికి వాసన కూడా రాదు. అలాగే ఉప్పునీటిలో కూడా బట్టలు నానబెట్టి తర్వాత సబ్బుతో ఉతికి చల్లని నీటిలో జాడిస్తే రంగు పోకుండా ఉంటుంది. తప్పకుండ రంగు దుస్తుల్ని ,వేరుగా ఎండ తగిలేలా ఆరేయాకూడదు తిరగేసి ఉతికి అలాగే ఆరేయాలి.

Leave a comment