సగ్గు బియ్యం అంటే తెల్లని పరమాన్నం గుర్తుకు వస్తుంది కాని ఇప్పుడు రంగు రంగుల సగ్గు బియ్యం వస్తున్నాయి. ఆరోగ్యకరమైన కూరగాయలు,పండ్ల రుచులతో వచ్చే ఈ సగ్గు బియ్యంతో ఎన్నో పదార్ధాలు వండేయవచ్చు. క్యారెట్,బీట్ రూట్ పాలకూర ,స్ట్రాబెర్రీ,మామిడి ఇలా పండ్లు కూరగాయల రసాలు కలిపి రంగుల్లో తయారు చేసిన ఈ సగ్గు బియ్యంతో హల్వా, పులిహోర,ఉప్మా,డిసర్ట్ లు,ఫలుదా ,బబుల్ టీ,కేక్స్ తయారు చేస్తున్నారు. సగ్గు బియ్యం,కర్ర పెండలం దుంప లేదా సాగోపామ్ కాండం లోపలి భాగం పిండిలా చేసి దాన్నుంచి పాలు తీసి గుళికల్లా చేస్తారు. వీటిలో అధికశాతం పిండి పదార్ధం కొద్ది పాళ్ళలో ప్రోటీన్లు ఐరన్ కాల్షియం ఉంటాయి.క్యాలరీలు ఎక్కువే.

Leave a comment