Categories
పమిట అంచులకు,లాంగ్ గౌన్లకు క్లాత్ తో కుచ్చులుగా అటాచ్ చేసినట్లు అనిపించే రఫుల్స్ ఇప్పుడు చీరలకు మోడ్రల్ లుక్ తెస్తున్నయి. ఒకే డిజైన్ లో ఉండే చీరలకు రఫుల్స్ కుట్టిస్తే ఆధునిక స్టైల్ లో అందంగా కనిపిస్తున్నాయి. స్లీవ్ లెస్, పుల్ స్లివ్ లెస్ , కాలర్ నెక్ , ఫుల్ బ్లౌస్ వేసుకున్న రఫుల్ శారీస్ చక్కగా నప్పుతాయి. ఇవి ప్రత్యేకంగా సిల్క్ వస్త్రశ్రేణిలో అందంగా కనిపిస్తాయి. సాదా పట్టు సిల్క్ రకాలకు రఫుల్స్ అటాచ్ చేసి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే పెళ్ళి వేడుకుల్లో మేరిసిపోవచ్చు.