రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన డాక్టర్ స్నేహలత డాక్టర్ ప్రసాద్ తో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. జైపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో పీహెచ్.డి గ్రాఫిక్ పెయింటింగ్స్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహలత శిల్పాలు చెక్కటం లో సిద్ధహస్తులు. మొదటిసారిగా చెక్కిన మూడడుగుల ఎత్తున్న తెలంగాణ మహిళా మొహం శిల్పం ఆమెకు పేరు తెచ్చింది. రాజస్థాన్ జోధ్ పూర్ లో ఆమె రూపుదిద్దిన కళాఖండాలు ఎన్నో కనిపిస్తాయి. స్నేహ ఆర్ట్స్ పేరుతో గ్యాలరీ ఏర్పాటు చేశారామె.  స్నేహలత బృందంలో 70 మంది పని చేస్తారు. శిల్పం చెక్కాలంటే ఏకాగ్రత ఓపిక తో పాటు శారీరక సామర్థ్యం కూడా ఉండాలి అంటారు స్నేహలత.

Leave a comment