గోపాల రాయి… దీన్నే ఓపల్ అంటారు. ఈ ఓపల్ రత్నాలలో డజను రకాలున్నాయి. ఎర్రని ఫైర్ ఓపల్, వివిధ రంగుల్లో కామన్ ఓపల్  ,ఇంద్రధనస్సు రంగులతో హార్లీ క్వీన్ ఓపల్ గాఢమైన నలుపు అయినా రంగురంగుల మచ్చలతో మెరిసే ఖరీదైన బ్లాక్ ఓపల్ వంటివి ఉన్నాయి. ఈ రత్నాలు సిలికా ఖనిజం నుంచి ఏర్పడతాయి. ఈ రత్నం వెదజల్లే కాంతులను బట్టి దీన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. సమస్త రత్నాల వర్ణాలను నింపుకున్న ఈ అరుదైన ఓపల్ శుక్రునికి  చెందిన రత్నం అంటారు. పారదర్శకంగా కనిపించే ఓపల్ స్టోన్ ఉంగరాలు నెక్లెస్ లలో లాకెట్ లలో ధరించటం ఫ్యాషన్.

Leave a comment