ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మహిళలకు చేతులు రసాయన ప్రభావానికి గురై ఎగ్జిమా అవకాశాలు ఎక్కువవుతాయని రిపోర్ట్. ఎక్కువసేపు తడిగా ఉండటం క్లీనింగ్ ,వాషింగ్ ప్రక్రియలో, నీళ్ళు డిటర్జెంట్స్ ఇతర బాత్ రూమ్ ,కిచన్ లకు వాడే రసాయనాలు చేతులు పాడు చేస్తాయని ఈ రసాయనాల కారణంగానే దీర్ఘకాలిక హాండ్ ఎగ్జిమా ఉంటుంది. దీన్ని నయం చేయటానికి స్టెరాయిడ్స్ సూచిస్తూ ఉంటారు వైద్యులు. ఇలాంటి పరిస్థితి రాకుండా నాణ్యమైన తేలికపాటి రసాయనాలు తక్కువ ఉండే క్లీనింగ్ సామాగ్రి ఎంచుకోవాలి ఇప్పుడు సహజ ఉత్పత్తులు కూడా చాలానే వస్తున్నాయి. ప్రతి రోజు పని కాగానే చేతులకు మంచి మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయటం ,చేతులను ఎక్కువసేపు పొడిగా ఉండేలా చూసుకొవటం చాల ముఖ్యం..

Leave a comment