ఇంట్లో తయారు చేసుకునే లిప్ బామ్ ల వల్ల పెదవులకు మంచి పోషణ అందుతుంది అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఒక గిన్నెల్లో తేనె, కొబ్బరి నూనె కలిపి పెదవులను స్క్రబ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. పెదవులకు తేమ అందించేందుకు ఈ మిశ్రమం బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఎలాంటి రసాయనాలు ఉండవు. తేనె, షుగర్ ,కొబ్బరి నూనె కలిపి నెమ్మదిగా రాస్తే మృతకణాలు రాలిపోతాయి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ , ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకు పోషణ అందుతుంది. పెదవులు పొడి బారటాం సహజం . అలాంటప్పుడు ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకొనే లిప్ బామ్ వాడటం వల్ల పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment