మనిషికి ఎప్పుడూ అన్వేషణ పైన మమకారం పోదు. ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా ఇంకా ఎదో కావాలన్న తపన మనిషిలో లేకపోతె ముందుకు పడే అడుగులు ఏనాడో ఆగేవి. అలా వచ్చినవే హాట్  రాక్  ఫైరింగ్. నున్నటి  బండరాయి పైన వంట చేయడం,  ఆమ్లెట్, చపాతీ కాల్చుకోవడం. ఇప్పుడో ఆటవిక కాలంలో ఎర్రని ఎండలో వేడెక్కిన రాయి పైన మాంసం వేడి చేసుకు తిన్నా పూర్వీకులకు నమస్కారం పెట్టి ఆధునిక షెఫ్ లు రాక్ రెస్టారెంట్స్ కు శ్రీకారం చుట్టేశారు. రాతిని వేడి చేసి  దాని పైన ఆహారం వండి ఇందో సన్నటి రాతి పలక పైన వేడిగా వడ్డిస్తారన్నమాట. అలాగే బాండీ లో ఇసక పోసి, వేడెక్కిన ఇసక మధ్యలో అల్యూమినియం స్ధాయిల్లో, చేపనో, మాంసాన్నో చుట్టి పెట్టి, దాన్ని హాట్ సాండ్ ప్రైంయింగ్ అంటున్నారు. భోజన ప్రియులు తింటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లు మారియట్  హాటల్ లో ఇలాంటి వంటకాలు దొరుకుతున్నాయి. తినాలంటే ఆరా తియచ్చు.

Leave a comment