రాత్రి పడుకునే ముందర  తలా నుంచి అరి కాలి  వరకు ఎలాంటి మేకప్  క్రీములు  శుభ్రంగా తొలగించి మరీ  పడుకోండి అంటున్నారు  ఎక్స్ పర్ట్స్. రాత్రి వేళ యాంటీ   ఏజింగ్ సీరమ్స్  ని , కళ్లకింద వాడే క్రీములని, రెటినాల్స్ వున్న ఉత్పత్తులని వాడవచ్చు. విటమిన్ సి, హైడ్రో క్వినోన్ వున్న ఉత్పత్తులు, సూర్య రశ్మిలో వాడారు కనుక    వాటిని రాత్రి వేళ వాడవచ్చు. శరీరం విశ్రాంతి దశలో వున్నప్పుడు, చర్మం యొక్క జీవక్రియలు రాత్రి పూత వేగవంతం అవ్వుతాయి. చర్మం  పై రాసే క్రీములు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోకి  పగలు కంటే రాత్రి వేళ బాగా ఇంకిపోతాయి. చర్మం  ముడతలు పడకుండా గీతాలు పడకుండా , వృద్ధాప్య లక్షణాలు  చర్మం మీద కనబడకుండా చేస్తాయి. నిద్ర పోయే ముందర ఏ క్రీము అయినా రాసుకోవాలి.

Leave a comment