పుస్తక ప్రేమికులకు ఈ ప్రపంచంలో కొదవే లేదు ఒక ఆటో రిక్షా డ్రైవర్ 56 ఏళ్ల ప్రదీప్ తను నడిపే ఆటో రిక్షా వెనుక పాలో కోయెల్హో (Paulo Coelho) పేరు ఇంగ్లీష్ లో మలయాళం లో రాసుకుని సోషల్ మీడియా హీరో అయ్యాడు. 74 సంవత్సరాల రచయిత పాలో కోయెల్హో రాసిన అల్కెమిస్ట్ ఇప్పటికీ బెస్ట్ సెల్లర్. విజేతగా నిలవాలనుకునే లక్ష్యం ఉన్నవాళ్లకు పాలో కోయెల్హో రచనలు స్ఫూర్తి. కేరళ కు చెందిన ప్రదీప్ ఈయన అభిమాని. ఆటోరిక్షా వెనక్కి రాసిన తన పేరును రచయిత ట్వీట్ చేయటంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఆటో ఫోటోను ట్యాగ్ చేస్తూ కేరళ ఇండియా (థాంక్యూ వెరీ మచ్ ఫర్ ది ఫోటో) అంటూ క్యాప్షన్ పెట్టారు పాలో కోయెల్హో.

Leave a comment