భారతీయ వంటల్లో కారం లేని కూర ఉండదు మిర్చి లో వేల రకాలున్నాయి. కానీ అన్నింటి  తోనూ కారం తయారు చేయరు. మనదేశంలో గుంటూరు, బెంగళూరు మిర్చి, కాశ్మిరీ  రెడ్  చిల్లి శంకేశ్వరి వంటి రకాలు కారం కోసం వాడతారు. హంగరీ లో తియ్యగా ఉండే బెల్ పెప్పర్   రకాలతో కారాలు తయారు చేస్తారు. దీన్ని ప్యాప్రికా అంటారు. జాతీయ అంతర్జాతీయ షెఫ్ లు  కాశ్మీరీ కారాన్ని వాడతారు ఇది ఎంతో ప్రకాశవంతమైన రంగులు, తక్కువ కారం తో ఘాటైన రుచితో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎన్నో రంగులతో, అలెప్పో, అంబో, చిపోట్లే,జలపెనో న్యూ మెక్సికో, ఏసియె  అల్టోనా  వంటి మిర్చి రకాల తో రంగుల కారాలను తయారు చేస్తున్నారు. లేత గులాబి, లెమన్ డ్రాప్, ఉదా రంగు, పీచ్, చాకోలెట్, ఆకుపచ్చ రంగు కారాలు  ఇప్పుడు వంటకాలకు అరుదైన రుచిని అందమైన రుచినీ ఇస్తున్నాయి.

Leave a comment