మహిళా నెలసరి శుభ్రత విషయంలో అవగాహన తీసుకువచ్చేందుకు యూనిసెఫ్ రెడ్ డాట్ చాలెంజ్ ను తీసుకొని వచ్చింది.యూనిసెఫ్ గుణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది అమ్మాయిలు సాధారణ పరిశుభ్రతకు కూడా నోచుకోక బాధపడుతున్నారు.  ఇంట్లోనూ పాఠశాలల్లో కూడా సరైన శానిటేషన్ గానీ కనీసం నీరు కానీలభించదు.ఎంతోమంది అమ్మాయిలు స్కూలు మానేయడానికి ఇదే కారణం. నెలసరి విషయంలో అమ్మాయిల్లో మహిళల్లో అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ రూపొందించిన రెడ్ డాట్ చాలెంజ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు అరచేతిలో పెద్ద ఎరుపు చుక్కపెట్టుకుని సంఘీభావ ప్రకటనలు చేశారు.

Leave a comment