తల్లీ ,తండ్రీ పిల్లలతోనే కుటుంబాలు ఇరుకైపోయి బంధువులు పిలుపుల్లో కూడా కనుమరుగై పోతున్నారు. ఎవ్వళ్ళ ఇళ్ళకు వెళ్ళకపోవటంతో సొంత పెదనాన్నలు, బాబాయ్ లు, మేనత్తలు కూడా ఏమని పిలవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయతలు, అనుబంధాలు కొరవడుతున్నాయి. వరసలు పెట్టి పిలవటం తల్లిదండ్రులే అలవాటు చేయాలి.బిజీ అనుకోంటూ దూరంగా ఉండిపోతే మరీ వంటరి వాళ్ళైపోతారు. బంధవ్యాలు తెలియజేప్పాలి. కనీసం ఫోన్లలో అయినా పరిచయాలు మరిచి పోకుండా పలకరింపులు కోనసాగించాలి. పిల్లలకు పిలుపులు పెద్దవాళ్ళే నేర్పాలి.

Leave a comment