మనుష్యులు చక్కగా పనులు చేసుకోవాలి . నైపుణ్యాన్ని ప్రదర్శించి తీరాలి కానీ ఆ పని చేయటంలో కాస్త రిలాక్సేషన్ మాత్రం అవసరం అంటారు నిపుణులు. పని వత్తిడి నుంచి బయట పడేందుకు పనిచేస్తున్న చోటే క్రమ పద్దతిలో రిలాక్స్ అవటం నేర్చుకోవాలి. పని మధ్యలో ఒక రెండు నిముషాలు బ్రేక్ తీసుకోని శరీరాన్ని గట్టిగా ఒకసారి కదిలించటం ,చేతులు చాచటం,మోచేయి భుజ భాగాల విదిలించటం చేయాలి . లేచి నిలబడి అటూ,ఇటూ ఓసారి నడిచి శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేయాలి . శరీర భాగాలను కదిలిస్తే పనిలో ఒత్తిడి మాయం అవుతుంది . సువాసనలు కూడా వత్తిడి తగ్గిస్తాయి . అలాగే మెదడుకు శక్తి నిచ్చే పదార్దాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి . డైఫ్రూట్స్ ,విటమిన్-సి ఉన్నా పండ్లు తినాలి . మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటికి వచ్చే వరకు మరేమి తినం అనే అలవాటు నుంచి బయటకు రావాలి మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉండాలి .

Leave a comment