Categories

‘రిలాక్స్ ప్లే త్రైవ్ ‘ పేరుతో ఒక పుస్తకం తీసుకువచ్చింది అనుజా లునియా మహారాష్ట్ర లోని థానే లో పుట్టిన అనుజా ఫిజియోథెరపిస్ట్ వృద్ధులకు ఫిట్నెస్ కోచింగ్ వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది స్ట్రెస్ స్ట్రాటజీస్ట్ కూడా. ఆమె రాసిన పుస్తకం లో ఒత్తిడి నుంచి బయటపడే సైన్స్ ఆధారిత స్ట్రాటజీల గురించి రాసింది రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలు కేటాయించిన ఈ పుస్తకంలో ఉదాహరించిన టెక్నిక్స్ తో ఒత్తిడి పోగొట్టుకోవచ్చు. ఈ పుస్తకం చదివి చావు అంచుల వరకు వెళ్లిన వాళ్లు కూడా వెనక్కి తిరిగి మామూలు జీవితం మొదలుపెట్టారు.ఈ పుస్తకం వీలైతే ఆన్ లైన్ లో దొరుకుతుంది తెప్పించుకొని చదవండి.