షాపింగ్ కోసం ఇప్పుడు కాన్సెప్ట్ స్టోర్ లు ఎంచుకోండి. షాపింగ్ సరదా తీరడం తో పాటు వారంతపు రిలాక్సేషన్ కుడా అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ కాన్సెప్ట్ స్టోర్స్ ఆలోచన మరీ కొత్తడెం కాదు. ఒక షాప్ లో కొద్ది కొద్ది ప్రదేశాల్లో విభిన్న లేబుల్స్, బ్రాండ్స్ సౌకర్యంగా అమర్స్తారు. అసాధారణ వస్తువులు, అంతర్జాతీయ బ్రాండ్లు, షో పీసెస్ అన్ని ఒకే రూఫ్ కింద ఏర్పాటు చేస్తారు. ఎందరెందరో డిజైనర్లు తమ వస్తువుల్ని ఒకే చోటుకు చేర్చే అవకాశం ఇక్కడ వస్తుంది. ఆ స్టోర్స్ దగ్గర నిర్వహించే ఈ ఈవెంట్స్ కుడా ఫ్యాషన్, మ్యూజిక్ కళలు ఇలాంటివే అయి వుంది సాంస్కృతిక అనుభవాలు ఇస్తాయి. పువ్వులు, పుసకాలు అలంకరణ వస్తువులు ఫ్యాషన్ ,, నగలు, డిజైనర్ వస్తువులు అన్ని ఒకే ప్రదేశంలో లభిస్తే ఈ షాపింగ్ వారాంత రిలాక్సేషన్ గా మారడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.
Categories