వత్తిడి కి మందులు వాడటం కన్నా సంగీతం వినటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు. గత ఏడాది వివిధ దేశాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం నిరూపణ అయ్యింది. లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది డిప్రెషన్, యాంగ్జయిటీ, వత్తిడులకు గురయ్యారు సంగీతం వినటం వల్ల వాళ్ళు ఆ లక్షణాల నుంచి బయట పడతారు అని అధ్యయన కర్తలు చెప్పారు. సంగీతం పట్ల పెద్దగా అభిరుచి లేని వాళ్ళు కూడా మ్యూజిక్ వినటాన్ని ఇష్టపడ్డారు. సంగీతం ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుందని అధ్యయనకారులు గుర్తించారు.

Leave a comment