అన్నం మానేసి చపాతీలు తింటే బరువు తగ్గి పోతామని అనుకుంటారు. కానీ ఎక్కువ చపాతీలు తింటే బరువు పెరుగుతారు అంటున్నారు పోషకాహార నిపుణులు.బరువు తగ్గేందుకు ఎన్ని క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలో న్యూట్రిషనిస్ట్ ల సాయం తీసుకోవాలి. ఉదాహరణకు మధ్యాహ్నం 300 క్యాలరీలకు మించని ఆహారం తీసుకోవాలి అని న్యూట్రిషనిస్ట్ సూచిస్తే కేవలం రెండే చపాతీలు తినాలి .మీడియం సైజ్ చపాతీల వల్ల 71 క్యాలరీలు శరీరానికి అందుతాయి.అన్నం మానేసి నాలుగైదు చపాతీలు తినడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కూడా కార్బోహైడ్రేడ్లు ప్రొటీన్లు కొవ్వు మెగ్నీషియం ఇనుము ఫాస్ఫరస్ వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి.అంచేత చపాతీలు ఎన్ని పడితే అన్ని తింటే అనుకున్న ప్రయోజనం నెరవేరదు రెండు చపాతీలు రెండు చపాతీలు, కూరలు తింటే శరీరానికి సరిపోను క్యాలరీలు అందుతాయి.

Leave a comment