కవి విరించి కవితామైదానంలో కొత్త వెలుతురు లాగా వచ్చాడు అంటారు దర్భశయనం శ్రీనివాసాచార్య.ఆయన మాటలో చెప్పాలంటే ఈ కవి మాట పైన ధ్యాస ఉన్న కవి.ఫ్యాషన్ తో కవిత్వాన్ని హత్తుకుంటూనే విరివింటి విరివిగానే కవితలు రాస్తున్నారని చమత్కరించారు.స్త్రీల దృక్కోణంలో వారి వేదనల రూపంలో విరించి రాసిన కవితల్లో స్త్రీలపట్ల సమాజంలో చూపిస్తున్న వివక్ష ఎంతో తీవ్రంగా వినిపిస్తుంది.కవిత్వం అంటే రూపెత్తిన అక్షరమాల కాదు కవి దృష్టిలో…ఒక మంచి కవితను రాయగలగడం ఒక కలే అయితే తెల్లవారు జామునే కళ్ళు గట్టిగా మూసుకుని నిద్రను నటిస్తూ ఆ కళ నే మళ్లి మళ్లీ కంటాను అంటారు విరించి. అక్షరాలు కవితలు కవితలో స్త్రీల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోదరి ని ముఖానికి చుట్టిన స్కార్ఫ్ కింద ఒక నిర్భయ ముఖమే రూపకట్టాలి అంటూ తీవ్ర స్వరంతో చెబుతాడు.ఇంత చక్కని కవితలు తప్పనిసరిగా చదవండి.
వివరాల కోసం ఫోన్ నం: 9948616191.
Categories