Categories
జ్ఞాపక శక్తికి బరువుకి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. అల్జీమర్స్ గురించి చేసిన ఒక పరిశోధనలో బరువు ఎక్కువ ఉన్నవారు ఏదైన విసయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేక పోతున్నారని చెపుతున్నారు. ఎత్తు ,వయసుకి సంబంధించి బరువు సరిగ్గా ఉంటే చురుకు దనం ఉంటుందంటున్నారు. ఈ పరిశోధన ఏం చెపుతుందంటే శారీరక బరువు ఎన్నో అనారోగ్యలకు, అలసటకు మూలం. శారీరక ఆరోగ్యం పైన మానసిక బలం ఆధారపడి ఉంటుంది. మానసిక శక్తి శరీరానికి అన్ని విధాల కంట్రోల్ చేయగలుగుతుంది. సరైన బరువు మెయిన్ టెయిన్ చేయగలిగితే శారీరక ,మానసిక శక్తులు మన అధీనంలో ఉంటాయంటున్నాయి అద్యయనాలు.