Categories
యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలున్న యాపిల్ పండు రెండు ముక్కలు ప్రతిరోజు తినడం వల్ల మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయంటున్నారు.ఇవి శరీరంలో మానసిక ప్రశాంతతకు ఉపకరించే హార్మోన్ల ఉత్పత్తిలో అనుసంధానమైన రసాయనలను పెంచడంలో సహకరిస్తాయి. రోజుకు ఎదో ఒక పండు ముక్కలు రెండు తిన్నా మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గటం గుర్తించారట పరిశోధకులు. పండ్లు,కూరగాయల పై విభిన్న ప్రభావాల పై మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని పండ్లలో అత్యధిక యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున అవి డిప్రెషన్ ప్రభావం తగ్గించగలవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.