హరియాణాకు చెందిన 105 సంవత్సరాల రాంబాయి రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టిన రాంబాయి గత సంవత్సరం లోనే పరుగులు సాధన మొదలు పెట్టింది. వారణాసి లో తొలి పరుగు పందెంలో పాల్గొన్నది. కర్ణాటక మహారాష్ట్ర కేరళ లో జరిగే పోటీల్లో పాల్గొని డజను పైగా పతకాలను గెలుచుకుంది. జూన్ 15 న అథ్లెటిక్స్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వడోదరా లో నిర్వహించిన ప్రారంభ నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణ పతకం గెలుచుకుంది. తాజాగా జూన్ 19 న నిర్వహించిన పోటీల్లో మరో స్వర్ణాన్ని గెలుచుకుని రికార్డ్ సృష్టించింది.

Leave a comment