ఏదైనా స్పెషల్ అకేషన్ లకు బర్త్ దే పార్టీలకు డ్రెస్సులు జ్యువెలరీని ముందే సిద్దం చేసుకున్నట్లు చర్మం శిరోజాల పైన కుడా ముందే ద్రుష్టి పెట్టండి అంటున్నారు బ్యూటీషియన్లు. పార్టీకి ఒక రోజు ముందే మేనిక్యూర్, పెడిక్యుర్ చేయించుకోవాలి. చేతులు మరింత చక్కగా కనిపించాలంటే నిమ్మరసంలో చక్కెర కలిపి ఆ మిశ్రమం తో   చేతులు స్క్రబ్ చేయాలి. వాక్సింగ్, ధ్రెడ్డింగ్ చేయించుకోవాలి. తేనె, రోజ్ వాటర్, పాల పొడి కలిపి ఆ పేస్టుని ఫేస్ మాస్క్ లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొహం మృదువుగా అయిపోతుంది. కళ్ళ కింద నిద్ర లేమిని సూచించే ఉబ్బులు కనిపిస్తే చల్లని టీ బాగ్స్ కాళ్ళపైన పెట్టుకుని రెస్ట్ గా కాసేపు వుంటే కళ్ళు మెరిసి పోతాయి. అలసట పోతుంది. షాంపూ తో ఒక రోజు ముందే తలస్నానం చేసేయాలి చేసే ముందర గోరు వెచ్చని కొబ్బరి నూనె తో తలకు మసాజ్ చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

Leave a comment