రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు. బాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి దేశమంతతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంభ పరిధి లోను, సామాజికంగాను జరుపుకునే పండగ ఇది. ఒకప్పుడు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893 లో బాల గంగాధర్ తిలక్ అద్వర్యంలో మహారాష్ట్రాలో సాముహిక ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. హిందూ సమాజంలో అన్ని వర్ణాల మధ్య స్నేహ సంబంధాలను పెంచేందుకు, జాతీయ భావాల్ని ప్రోత్సహించేందుకుమొదలుపెట్టిన ఈ గణపతి నవరాత్రులకు ఉత్సవాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. వినాయకుని సంతోష పెడితే ఆటంకాలు రాకుండా కార్య సిద్ది లభిస్తుందని, కష్టాలు తీరతాయని ఐశ్వర్యాలు సిద్దిస్తాయని భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

Leave a comment