కోవిడ్ -19 ప్రపంచాన్ని ఎంతో మార్చింది ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో విందులు వినోదాలు చేయటం అరుదై పోయింది ఇప్పుడు జపాన్ లోని పేరెంట్స్ తమ పిల్లలను ఆశీర్వదించే వేడుకకు బంధువులను ఆహ్వానించకుండా Dakigokochi (Dakigokochi) పేరుతో పిల్లల బొమ్మలు ముద్రించిన బియ్యం సంచిని బంధువుల ఇళ్లకు పంపిస్తున్నారు. స్వయంగా వెళ్లి బిడ్డను చూడలేని బంధుమిత్రులు బియ్యం సంచి పైన కొత్తగా జన్మించిన పిల్లవాడి బొమ్మను చూసి ఆశీర్వదించే లాగా సరిగ్గా ఆ శిశువు బరువు తో ఈ రైస్ బ్యాగ్ తయారు చేశారు ఈ బుల్లి బస్తా కి డకిగోకొచి (Rice baby) అని పేరు పెట్టారు. ఇప్పుడు జపాన్ లో పిల్లల పుట్టిన రోజు వేడుకలకు ఈ రైస్ బ్యాగ్ పంపటం ఆనవాయితీ అయిపోతుంది.

Leave a comment