ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో బైక్ రైడింగ్ చేయటం నాకు చాలా ఇష్టం ఎం.బి.ఏ పూర్తిచేశాక బైక్ తో కలిసి ఉండే ఉద్యోగాల కోసం నెట్ లో వెతికేదాన్ని అలా అంతర్జాతీయ మోటో వ్లాగర్స్ ల గురించి చదివాను అమ్మ నగలు అమ్మి బైక్ కెమెరా వంటివి కొనిచ్చింది. రైడర్ గర్ల్ విశాఖ దేశంలో తొలి మహిళ మోటో వ్లాగర్స్ గా నిలిచాను ఏటా ఆన్ లైన్ లో అంతర్జాతీయ మోటో వ్లాగర్స్ సమావేశం జరుగుతుంది. అందులో మన దేశం తరఫున పాల్గొన్న తొలి మహిళ ను నేనే అంటుంది 27 సంవత్సరాల విశాఖ ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకొంది విశాఖ. నాలుగేళ్లుగా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలలో రికార్డ్ లు సృష్టిస్తోంది. ఆమెయూట్యూబ్ ఛానల్ కు ఎనిమిది లక్షల మంది సబ్ స్కైబర్స్ ఉన్నారు.

Leave a comment