అస్సాం కు చెందిన రైఫిల్ ఉమెన్ బృందాలకు ఎంతో మంచి పేరు ఉంది. అస్సాం రైఫిల్స్ లో భాగమైన ఈ రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలు పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు చూపెట్టి ఆపదలో ఉన్న వారిని కాపాడుతారు. అస్సాం లో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచార్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలం అయింది. ఇళ్లన్నీ నాని పోయి ఏ నిమిషంలో కూలి పోతాయో అన్నట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ రైఫిల్ ఉమెన్ ప్రాణాలకు తెగించి ఎంతో మందిని రక్షించారు.

Leave a comment