ఉషా కుమారి కేరళలో ఒక స్కూల్ టీచర్ . నెయ్యార్ అటవీ ప్రాంతంలో అగస్ద్యార్ కూడమ్ గ్రామం ఎత్తైన కొండపైన ఉంది . గిరిజన బాలల కోసం అక్కడో స్కూల్ ఉంది . స్కూల్లో ఎంతో మంది పిల్లలు లేరు కానీ టీచర్ అక్కడికి రావడం చాలా కష్టం ఉషా కుమారి గత 16 సంవత్సరాలుగా ప్రతి రోజు ఉదయం ఏడున్నర గంటలకు ఇంట్లో బయలుదేరి నది వరకు స్కూటర్ పై వస్తుంది . అక్కడ నుంచి పడవలో అడవి దగ్గరకు వస్తుంది చేతిలో కర్ర ఆ అడవిదాటి కొండ ఎక్కి స్కూల్ చేరుకుంటుంది . మధ్యాహ్నం భోజన పథకం కోసం ఫండ్స్ సరిగ్గా అందక పోతే తన జీతంలో ఖర్చు పెడుతుంది . ఉషా ఒక్కతే ఆస్కూల్లో టీచర్ . గిరిజనులు జీవితాల్లో కాస్తయినా వెలుగు తేవాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా స్కూలుకి వస్తుంది .

Leave a comment