ఇప్పటివరకు వందకు పైగా పాటలు పాడేను. కరోనా సమయంలో కాళీ దొరికాక,బుల్లెట్ బండి పాట ఐడియా వచ్చింది. లక్ష్మణ్ గారికి నా ఆలోచనలు తెలిపితే ఆయన పాట రాశారు. సంగీత దర్శకులు బాజీ గారు చేసిన ట్యూన్ తో నేనే పాడి,యాక్ట్ చేసిన బుల్లెట్ బండి కి పాట ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించలేదు అంటోంది మోహన భోగరాజు. నేను పాడిన పాటల్లో బాహుబలి చిత్రంలో మనోహరి నాకు ఎంత ప్రత్యేకమో బుల్లెట్ బండి పాట కూడా అంతే ప్రత్యేకం అంటోంది మోహన భోగరాజు. నా యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన ఈ పాట ఇప్పుడు పెళ్లిళ్ళు భారత్ లలో మార్మోగిపోతోంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది మోహన భోగరాజు.

Leave a comment