ఒక్క రోజ్ వాటర్ చాలు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే అవసరం రాకుండా చేసేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజ్ వాటర్, నిమ్మరసం చక్కని స్కిన్ టానిక్. దీనివల్ల మొటిమలు, కురుపులు రావు. నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్, నిమ్మరసం కలపి రాసుకొని ఒక పావుగంట పాటు ఉంచుకొని కడిగేస్తే చాలు చర్మం గులాబీ పూల అందంతో మెరిసి పోతుంది. రోజ్ వాటర్, ఆల్మండ్ కలిపిన పేస్ ప్యాక్ పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. బాదం, తేనే, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం తెలుపు దనం సంతరించుకుంటుంది. ఇది పకృతి సిద్దమైన లోనర్ లాగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తో కళ్ళు శుభ్రం చేసుకుంటే మెరిసి పోతాయి. షాంపుతో రోజ్ వాటర్ కలిపి వాడితే జుట్టు కుదుల్లకు మంచి కండిషనింగ్ అవుతుంది.

Leave a comment