పర్ఫ్యూమ్స్ పరిమళం రోజంతా సువాసన పంచుతూ ఉండాలనుకుంటే దాని గాఢత శాతం ఎంత ఉందో గమనించాలి 10 నుంచి 40 శాతం గాఢత ఉంటే పర్ఫ్యూమ్ సువాసన ఏడెనిమిది గంటలు అలాగే ఉంటుంది. స్నానం చేసిన వెంటనే పర్ఫ్యూమ్ చల్లుకోవాలి అప్పుడు స్వేద గ్రంధులు తెరుచుకుని ఉంటాయి. ఆ పరిమళం ఎక్కువ సేపు ఉంటుంది. మణికట్టు చెవి వెనుక మోకాలు దగ్గర పర్ఫ్యూమ్ చల్లుకోవాలిి. ఈ పల్స్ పాయింట్స్ దగ్గర  ముందుగా పెట్రోలియం జెల్లీ రాస్తే పరిమళం ఎక్కువసేపు ఉంటుంది.ఏదైనా సమావేశాల్లో ఫ్రెష్ గా ఉండాలనుకుంటే ఒక కాటన్ బాల్ పైన పర్ఫ్యూమ్ చల్లుకొని బ్యాగ్ లో వేసుకుంటే బావుంటుంది.

Leave a comment