వర్షం వస్తే బయటికి వ్యాయామం కోసం ఏ జాగింగ్ కు వెళ్లడం చాలా కష్టం అప్పుడు ఇంట్లోనే చేయగలిగే స్పాట్ జాగింగ్, తాడట, స్ట్రెంత్ ట్రైనింగ్, ప్లాంక్స్ యోగ చేయొచ్చు. ముఖ్యంగా స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే రెండు లీటర్ల వాటర్ బాటిల్ లను నీటితో నింపి రెండు చేతులతో వాటిని ఎత్తి ఉంచాలి. కుర్చీలో కూర్చుని రెండు చేతులతో రెండు బాటిళ్లను పెట్టుకుని పైకెత్తే ఉంచాలి. ఇది ఎముకలను దృఢ పరిచే ఎక్సర్ సైజ్.  రోజు మొత్తంలో ఎప్పుడు చేసినా రెండు వందల కేలరీల వరకు ఖర్చు అవుతాయి.ప్లాంక్స్ కూడా పడుకొని మోచేతులు అరికాళ్ళ ఆధారంగా శరీరం మొత్తం పైకి లేపి ఉంచాలి. ఇలా పది సెట్లు చేస్తే100 కేలరీలు కరుగుతాయి. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు కూడా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తాయి.

Leave a comment