రోజుకో గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చాలు. దీనిలోని విటమిన్లు జుట్టు పెరగటానికి, చర్మ సౌందర్యానికి ఒక టానిక్ లా పని చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ లను వెలికి పంపేందుకు దోహదం చేస్తాయి. శరీరం నీరసించినా, అలసట కలిగినా గ్లాసు బత్తాయి రసం సత్వరం పని చేసి ఓపిన్ తెచ్చి పెడుతుంది. తరచుగా జ్వరం వస్తున్న, సీజనల్ జ్వరాలకు, వైరస్ తో బాధ పడే వారికి బత్తాయి రసం బాగా పని చేస్తుంది. ఆర్దరైటిస్ తో బాధ పడే వారు ఈ రసం క్రమం తప్పకుండా తాగితే నొప్పులు ఉపశమిస్తాయి.

Leave a comment