కొన్ని అలవాట్లువువనాలవుతాయి.వాటిల్లో మొదటి ఒకటి రెండు వాట్సప్, ఫేస్ బుక్ అని వేరే చెప్పనక్కరలేదు.ఈ రెండు రెగ్యులర్ పనుల్ని దెబ్బతీసేవే. అలా రోజంతాకాకుండా ఒక నిర్ణీతమైన సమయం ఫిక్స్ చేసుకుంటే మిగిలిన వర్క్ చెడిపోకుండా వుంటుంది. మొదట్లో ఇబ్బంది కానీ తర్వాత అలవాటైపోతుంది. అలాగే కాస్త సమయం దొరికినా ఎదో ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు, తెలుసుకునేందుకు ఉపయోగిస్తే మనం ఓ అడుగు ముందుకు వేసినట్లు స్నేహితులతో గడపడం, ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించటం ఇవి అవసరమైన ముఖ్యమైన పనులు. రోజుకో కొత్త పుస్తకం చదవలనుకుని చుస్తే సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు, ఎంత విషయ సేకరణ, ఎంతమంది అనుభవాలు పంచుకున్నట్లు మన సమయం దేనికి కేటాయిద్దాం.

Leave a comment