కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ తీసుకున్నంత పని అవ్వుతుంది. ఇక 450 అరటిపండ్లు ఒకే సారి తినగలిగితే అందులో వుండే పోటాషియం ఓవర్ డోస్ తో మనిషి చనిపోతాడట. మానసిక వత్తిడి ఆందోళనకు అరటిపాండే మందు. ఇందులో కొవ్వు, కోలెస్ట్రోల్, సోడియం వుండవు. విటమిన్-సి, పొటాషియం, మాంగనీస్, విటమిన్-బి ఉంటాయి. ఈ పండులో 70 శాతం నీరే వుంటుంది. ఇంత విశేషమైన పండు రోజుకి ఒక్కటి తిన్నా కావల్సినంత శక్తి లభిస్తుంది.
Categories