ప్రకృతిలో వి చిత్రాలకు  అద్భుతాలకు కొదవే లేదు. ఓక్లహోమా ఎడారి లో ఇసుక నేలపైన అందాల గులాబీలు విరియటం ఒక ప్రకృతి  వింత. కొన్ని ఖనిజాలు నేలపైన విచ్చుకొన్న గులాబి పూల రూపంలో ఏర్పడతాయి,సాధారణంగా లోతు తక్కువగా ఉండే ఉప్పునీటి కయ్యల్లో నీరంతా ఆవిరై అక్కడ ఉన్న జిప్సమ్  లేదా బెరైట్  ఖనిజాలు  క్రిస్టల్స్ లాగా రూపుదిద్దుకుంటాయి.అలా ఏర్పడే దిశలో అక్కడ వీచే గాలి ద్వారా ఒక్కసారి ఇలా పువ్వు ఆకారంలో కి వస్తాయి.ఇసుక రంగుని బట్టి ఈ రాళ్ళు లేత ఎరుపు నుంచి ముదురు ఎరుపు వర్ణాల్ని అద్దుకుంటాయి.వీటిని డెజర్ట్ రోడ్ ,రోజ్ రాక్ గార్బెర్ సాండ్ స్టోన్  జిప్సమ్ రోజ్,పెలనైట్ రోజ్ అని పిలుస్తారు. ఓక్లహోమా ఎడారిలో విరిసేపూలు గులాబీలు లాగా ఉంటాయి.

Leave a comment