రోజ్ వాటర్ ,తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు తో మొహానికి పట్టిస్తే చాలా మంచిది . అయితే దాన్ని పద్ధతిగా చేయాలి . ఒక కాటన్ బాల్ ను రోజ్ వాటర్ లో ముంచి ముఖం పైన అద్దాలి . ఇలా చేయటం వల్ల చర్మం శుభ్రం పడటమే కాకుండా ముఖ చర్మం పైన ఉండే స్వేద గ్రంథులు తెరుచుకొంటాయి . చర్మం తాజా గా కనిపిస్తుంది . ఈ గులాబీ నీరు లో ముల్తానీ మట్టి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది . ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఈ పేస్టును ముఖానికి అప్లయ్ చేయాలి . అలాగే ఆరెండు ఫేస్ ప్యాక్ కూడా చర్మ రంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది . నారింజ తొక్కలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి . అందులో రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి . అరగంట తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది .

Leave a comment