ఇక వాతావరణం మారుతోంది.చాలా తొందరగా వేడి గాలి వచ్చేస్తుంది.ఈ పోడి గాలికి చర్మం పొడిగా అయిపోతుంది.రోజ్ వాటర్ లో కొన్ని కాంబినేషన్స్ కలిపి ఫేస్ ప్యాక్‌ వేసుకోండి చర్మం పొడివారదు అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. టేబల్ స్పూన్ గంధం పొడిలోకి అర టీస్పూన్ చొప్పున బాధం నూనె,కొబ్బరి నూనె కలిపి ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి మొహానికి మాస్క్ లాగా వేసి అరగంట ఆగాకా కడిగేస్తే ముఖం తేటగా ఉంటుంది. తర్వాత మాయిశ్చరైజ్ రాసుకుంటే సాయంత్రం వరకు ఆ ఫ్రెష్ నెస్ పోకుండా ఉంటుంది, అలాగే ముల్తానా మట్టి,పాలు ,రోజ్ వాటర్ కలిపి పెస్ట్ చేసి మాస్క్ లా వేసుకోని ఓ అరగంట ఆగాక కడిగేసిన ఇదే రిజల్ట్ . ఈ చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి.

Leave a comment