ఎక్కువ సేపు ఫోన్ చూసినా, కంప్యూటర్ పై పని చేసిన కళ్ళు పొడిబారి పోయి మంట,దురద అనిపిస్తాయి. కళ్ళలో తేమ తగ్గడం వల్లే ఈ సమస్య ఎదురవుతుంది.మంచి నీటిలో శుభ్రంగా కడిగిన గుప్పెడు గులాబీ రేకులు తీసుకోవాలి కప్పు నీళ్లను మరిగించి,ఆ నీటిలో గులాబీ రేకులు వేయాలి ఆ నీటిని చల్లారాక వడకట్టి ఆ గులాబీ నీళ్లలో  దూది ముంచి కళ్ళ పైన ఐదు నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తగ్గిపోతాయి. అలాగే త్రిఫల చూర్ణం నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి దాన్ని వడగట్టి ఆ నీటితో కళ్లను కడుక్కుంటే ప్రయోజనం ఉంటుంది.

Leave a comment