గుజరాత్ లోని రోటీ బ్యాంక్ లాక్ డౌన్ సమయంలో రోజుకు లక్షన్నర మంది ఆకలి తీరుస్తోంది. మీ ఇంట్లో రోటీలు చేసుకున్నప్పుడు ఇంకో ఐదు అదనంగా చేసి ఇవ్వగలరా అని ఒక ఎన్జీవో, అడిగినప్పుడు, ప్రీతి శుక్లా అన్న మహిళ సంతోషంగా ఇస్తానంది .ఆమెతోపాటు ఓ అపార్ట్మెంట్లో అందరూ తలా ఐదు చేసి ఇస్తున్నారు.అలా ఇరుగు పొరుగు చేతులు కలిపితే రోటీ బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చింది.ఎందరో గృహిణులు తమ ఇళ్ళల్లో నుంచి లక్షన్నర చపాతీలు ఇస్తున్నారు.భరత్ షా,రాంజీ చందర్ అనే ఇద్దరు గుజరాతీలు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ ఆపద సమయంలో ఈ రోటి బ్యాంక్ వలస కూలీల అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయి.

Leave a comment