డేవిడ్ హాన్సన్ సృష్టించిన సోఫియా రోబో ఇప్పుడు చిత్రకారునిగా ప్రముఖ కళాకారుడు ఆండ్రీ బోనాసేటో సౌజన్యంతో అద్భుతమైన డిజిటల్ చిత్రాన్ని సృష్టించింది దీన్ని 888 అనే కళాభిమాని ట్విట్టర్ ద్వారా బేరం కుదుర్చుకుని ఆన్ లైన్ లో ఐదు కోట్లు చెల్లించి  సొంతం చేసుకున్నాడు ఇటాలియన్ కళాకారుడు బోనాసేటో సోఫియా చిత్రాన్ని రూపొందించారు అతను చిత్రిస్తున్న విధానాన్ని వేళ్లు, నరాల కదలికలను ద్వారా పసిగట్టిన సోఫియా బోనాసేటో చిత్రాలకు డిజిటల్ పద్ధతిలో ప్రతి సృష్టించేసింది సోఫియా కు చిత్రలేఖనంలో చేయి తిరిగిందనీ త్వరలోనే సంగీతంలోనూ తన ప్రావీణ్యం చూపెడుతోందని సోఫియా సృష్టికర్త డేవిడ్ హాన్సన్ చెప్పారు. సోఫియా రోబోకు 2017 సౌదీ అరేబియా పౌరసత్వం లభించింది.

Leave a comment