ఇప్పుడు అన్ని రకాల పచ్చళ్ళు పెడతారు. అందులో గోంగూర కూడా ఒకటి. మంచి గోంగూర దొరుకుతుంది ఈ రోజుల్లో ఎంతరుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా మంచి ఐరన్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది. పొటాషియం చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తుంది. సీ విటమిన్ పాళ్ళు ఎక్కువ. ఫైబర్ కూడా ఎక్కువే గోంగూర లో దొరికే విటమిన్ సీ ప్రీ రాడికల్స్ ను హరించి యవ్వనవంతమైన చర్మం ఇవ్వగలుగుతుంది. గోంగూరతో ఎన్నో పదార్ధాలు రుచికరంగా ఐపోతాయి.

Leave a comment