కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E  విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా  పనిచేయాలంటే కూడా  కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా  కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.

Leave a comment